కలం, నిర్మల్ : నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామంలో రూ.20 లక్షల కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy ) బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుప్రియ, ఉప సర్పంచ్ రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Also: జంటగా ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్
Follow Us On: X(Twitter)

