కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్ సెట్ తో ఉన్నారని ఆరోపించారు. కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయమంటే ఎన్డీసీఏ సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యం అని ఫైర్ అయ్యారు.
గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుందని హరీశ్ రావు (Harish Rao ) చెప్పుకొచ్చారు. మిమల్ని ఉరి తీసినా తప్పులేదని కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి ఘాు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడని సంచలన ఆరోపణ చేశారు. నేడు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని.. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్కరోజులో 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చుని సూచించారు.
ఇకపోతే సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయని.. నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎత్తిపోయడం లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటర్లు అసలు ఆన్ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయి ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
Read Also: విదేశాలకు మన చేపలు.. కోహెడలో మెగా ప్రాజెక్ట్!
Follow Us On: Instagram

