కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్ (IAS Officers) లకు పదోన్నతులు కల్పించింది. 2013 బ్యాచ్ కు చెందిన 11 మంది ఐఏఎస్ అధికారులకు అడిషనల్ సెక్రటరీ హోదాతో ప్రమోషన్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శశాంక్, అద్వైత్ సింగ్, శ్రీజన, శృతి ఓజా, వినయ్, శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్, హన్మంతరావు, ఎం.హరిత, హైమావతి, కే.హరిత పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
ఈ ప్రమోషన్లు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నిబంధనల ప్రకారం అమలులోకి వచ్చాయి. అనుభవం కలిగిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పాలనలో వేగం, సమర్థత పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రమోషన్ పొందిన అధికారులకు త్వరలోనే కొత్త శాఖలు, బాధ్యతలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


