కలం, స్పోర్ట్స్ : కోహ్లీ(Virat Kohli) ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు ఆడియన్స్‌ను ఎంట్రీ చేయొద్దంటూ కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు కారణం. దాదాపు ఏడు నెలల తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium).. క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు ఈ ప్రతిష్టాత్మక మైదానం వేదిక కానుంది. తొలుత డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లీ(Virat Kohli), రిషబ్ పంత్(Rishabh Pant) వంటి స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో కోహ్లిని ప్రత్యక్షంగా చూడాలనుకున్న అభిమానులు
తీవ్ర నిరాశకు లోనయ్యారు. కర్ణాటక ప్రభుత్వం భద్రతా కారణాల వల్ల వీటికి ప్రేక్షకులను అనుమతించకపోవడం నిర్ణయించింది.
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సుమారు 2,000–3,000 మంది అభిమానులను వేదికకు అనుమతించాలని ప్రతిపాదించింది. కానీ గతంలో జరిగిన విషాద ఘటనల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ సిద్దరామయ్య సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో, విజయ్ హాజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఎదురు చూస్తున్న అభిమానులు తమ ఫేవరేట్ ప్లేయర్లను ప్రత్యక్షంగా చూడలేక నిరాశ చెందుతున్నారు.
Read Also: మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్!
Follow Us On: Youtube


