epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ క్రిమినల్​తో ఫ్లైట్​ జర్నీలు చేసిన ట్రంప్​!

కలం, వెబ్​డెస్క్​: అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్​స్టీన్(Epstein)​ సెక్స్​ స్కాండల్​ స్కామ్​లో ఎట్టకేలకు ట్రంప్ (Trump) ​పేరును అమెరికా న్యాయశాఖ బయటపెట్టింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్​ పేరు వినిపిస్తున్నా, ఎప్​స్టీన్​తో ట్రంప్​ కలసి ఉన్న ఫొటోలు బయటికి వస్తున్నా అవన్నీ అనధికారికంగా బయటపడినవే. అయితే, ప్రస్తుతం ఎప్​స్టీన్​ కేసు ఫైల్స్​ను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి ఎప్​స్టీన్​ ఫైల్స్​ సమాచారాన్ని యూఎస్​ న్యాయాధికారులు కొంచెం కొంచెంగా ఆన్​లైన్​లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. లక్షల ఫైల్స్​ ఉండడంతో అంతా ఒకేసారి కాకుండా ఇలా దఫదఫాలుగా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి విడుదలయిన మూడో దఫా ఎప్​స్టీన్​ ఫైల్స్​లో అధ్యక్షుడు ట్రంప్​ పేరు కనిపించింది.

అమ్మాయిలను సంపన్నులు, రాజకీయ నాయకులు, సెలెబ్రెటీలకు ఎరగా వేసిన నేరస్తుడు అయిన ఎప్​స్టీన్​తో కలసి ట్రంప్ (Trump)​ కనీసం ఎనిమిది సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు ఈ ఫైల్స్​లో ఉంది. ఎప్​స్టీన్​ ప్రైవేట్​ జెట్స్​లో ట్రంప్​ ఈ జర్నీలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే, క్రిమినల్​తో కలసి ప్రయాణించిన మాత్రాన ట్రంప్​ నేరం చేసినట్లు కాదని అమెరికా న్యాయాధికారులు అంటున్నారు. కాగా, ఎప్​స్టీన్​ ప్రైవేట్​ జెట్​లో ఎప్​స్టీన్​తో పాటు ట్రంప్​, మరో 20 ఏళ్ల మహిళ(పేరు ప్రస్తావించలేదు) కలసి ఒకసారి జర్నీ చేశారని, అలాగే మరో రెండు సార్లు సైతం ట్రంప్​ వెళ్లిన జెట్​లో ఇద్దరు మహిళలు ఉన్నారని ఫైల్స్​లో ఉంది. దీనిపై అమెరికాలో కలకలం రేగుతోంది. ఎప్​స్టీన్​ సెక్స్​ కుంభకోణంలో ట్రంప్​ పేరు వెల్లడైనందున .. ఆయన తక్షణం పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్ష డెమొక్రాట్​ సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.

Read Also: మేం పారిపోయినవాళ్లం.. మాల్యా, మోదీ వ్యంగ్యం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>