కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బుధవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal)లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించడం వంటి అంశాలపై సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులతో కలిసి ముఖ్యమంత్రి లంచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రభుత్వం–గ్రామ పాలన మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వివరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గెలిచిన సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పార్టీలకతీతంగా అందరూ సర్పంచ్ లు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
Read Also: బీఆర్ఎస్‌ను ‘నీళ్ళ’తో కడిగేద్దాం : సీఎం
Follow Us On: X(Twitter)


