కలం, వెబ్ డెస్క్ : ప్రజలకు నాణ్యమైన, పర్యావరణహిత రవాణా అందించడమే లక్ష్యంగా పల్లె వెలుగు సేవల్లోనూ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులనే(AC Electric Buses) నడపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పష్టం చేశారు. మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది 1,450 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయి తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఉభయ జిల్లాలో ఈవీ చార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాబోయే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. 8 ఏళ్లకు పైగా కాలపరిమితి పూర్తైన బస్సులను దశలవారీగా ఈవీలుగా మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో ఇంధన ఖర్చు తగ్గడం, కాలుష్యం నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడం సాధ్యమవుతుందని సీఎం వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీఎస్ ను ఆధునికీకరణ దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఈవీ కీలక మార్పు అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు.
Read Also: గోవిందరాజ ఆలయ బంగారం గోల్‌మాల్‌పై టీటీడీ క్లారిటీ
Follow Us On: Youtube


