సంగారెడ్డిలో విద్యార్థుల భారీ ఆందోళన

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ ఆందోళన నిర్వహించారు. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలనే డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ వైపు విద్యార్థులు పెద్ద ఎత్తున దూసుకెళ్లడంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

విద్యా శాఖ మంత్రిని నియమించలేరా..?

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఆందోళనకారులు మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.9 వేల కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: ఇక పట్టుకునే బాధలుండవ్.. ఫాలో అయ్యే అంబ్రెల్లా ఇదిగో!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>