కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ లీగ్‌లో ఇంగ్లీష్ ప్లేయర్లకు వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. ఈ పరాజయాల పరంపరకు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌లను తొలగించడం మాత్రమే పరిష్కారమన్న వాదన వినిపిస్తోంది. దీనిపై తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ చీఫ్ ఆండ్రూ స్ట్రాస్ (Andrew Strauss) స్పందించారు. వారిపై వేటు వేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. మరోసారి ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
“మరోసారి ఆశలు, ఆశావాదంతో ఆస్ట్రేలియా వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెటర్ల కలలు కేవలం 11 రోజుల్లోనే కూలిపోయాయి” అని స్ట్రాస్ అన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన సిద్ధతపై మెక్‌కల్లమ్, స్టోక్స్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
అయితే, గతంలో ఆష్లీ జైల్స్, క్రిస్ సిల్వర్‌వుడ్, ఆండీ ఫ్లవర్, డంకన్ ఫ్లెచర్‌లకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేస్తూ, ఇంగ్లాండ్ నిరంతర పరాజయాలకు వ్యక్తులే కారణం కాదని స్పష్టం చేశారు. “1986–87 నుంచి ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఓటములకు ఒక్క కోచ్ లేదా కెప్టెన్‌ను బాధ్యుడిగా నిలబెట్టలేం” అని అన్నారు. ఆస్ట్రేలియా జట్టు మెరుగైన హై-పర్‌ఫార్మెన్స్ వ్యవస్థతో ముందంజలో ఉందని, ఇంగ్లాండ్ కూడా ఆ స్థాయిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని స్ట్రాస్ (Andrew Strauss) పేర్కొన్నారు.
2021–22 ఆషెస్ సిరీస్‌లో 4–0 ఓటమి తర్వాత దేశీయ క్రికెట్‌పై స్ట్రాస్ నేతృత్వంలో నిర్వహించిన హై-పర్‌ఫార్మెన్స్ సమీక్షను గుర్తు చేస్తూ, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తగ్గింపు, దేశీయ క్రికెట్ పునర్వ్యవస్థీకరణ వంటి సూచనలు అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. “ఇప్పుడు ఏర్పడిన నిరుత్సాహక, ఏకపక్ష కథలను మార్చాలంటే, కోచ్‌లు, కెప్టెన్లను తొలగించడం కాకుండా, దీర్ఘకాలికంగా అవసరమైన మార్పులను అమలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి” అని స్ట్రాస్ స్పష్టం చేశారు.
Read Also: వరల్డ్ కప్ ముందు స్టార్ ప్లేయర్‌కి సర్జరీ !
Follow Us On: Pinterest


