epaper
Friday, January 16, 2026
spot_img
epaper

డ్రెస్సుల వివాదంపై స్పందించిన శివాజీ

కలం, వెబ్ డెస్క్​ : హీరోయిన్​ డ్రెస్సులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణలు (Shivaji) చెప్పారు. దండోరా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్​ లో ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేయలేదన్నారు. ఆ రెండు పదాలు తప్పుగా మాట్లాడాను.. క్షమించండంటూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇటీవల హిరోయిన్స్​ ఇబ్బందులు పడుతున్న క్రమంలో నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడాను తప్ప ఎవరినీ అవమానించాలని కాదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదని, హీరోయిన్స్​ బయటకు వెళ్లినప్పుడు డ్రెస్సులు బాగుంటే మంచిదనే ఉద్దేశంతో చెప్పానన్నారు.

ఏదేమైనా రెండు పదాలు మాట్లాడకుండా ఉడాల్సిందని తెలిపారు. స్త్రీ అంటే మహాశక్తి.. ఒక అమ్మావారిలా భావిస్తానని చెప్పారు.ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారని.. ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఊరి భాష మాట్లాడనని చెప్పారు. తన ఉద్దేశ్యం మంచిదే కానీ.. రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. మంచి ఉద్దేశ్యంతో మాత్రమే మాట్లాడని.. అవమానపరచాలని కాదన్నారు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు.. అలాగే, మహిళలు తప్పుగా భావిస్తే అందరికీ క్షమాపణలు అంటూ శివాజీ(Shivaji) కోరారు.

Read Also: షాక్ ఇచ్చిన దిల్ రాజు.. మరి.. ప్లాన్ ఫలించేనా..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>