Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ విప్‌ల నూతన ఛాంబర్ ప్రారంభం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ శాసనసభ (Telangana Assembly) ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌ (Govt Whip)లకు కేటాయించిన నూతన ఛాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ప్రాంగణంలో కేటాయించిన నూతన ఛాంబర్‌ను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కి కూడా నూతన ఛాంబర్ కేటాయించారు.

ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని మీడియా అడ్వైజరీ కమిటీ నూతన కార్యాలయాన్ని ‌సైతం ప్రారంభించి, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడంలో, శాసనసభ వ్యవహారాల నిర్వహణను సమర్థవంతంగా మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో విప్‌ల‌కు నూతనంగా కేటాయించిన ఛాంబర్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మరింత అంకితభావంతో పని చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>