కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐజీ చంద్రశేఖర్, కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు.
పోలీస్ శాఖ అత్యంత కీలకం..
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఈ నూతన భవనం నిర్మించారని తెలిపారు.
విభాగాల పరిశీలన..
భవన ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand), ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి స్టేషన్ లోపలి విభాగాలు, ఆధునిక వసతులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, మణుగూరు డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On: Instagram

