Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోలులో అవినీతి.. మార్కెట్ చైర్మన్ రాజీనామాకు బీఆర్ఎస్ పట్టు

కలం, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా పెద్దముదునూరు గ్రామంలో ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్ రమణారావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. మార్కెట్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.

మార్కెట్ యార్డ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బిఆర్ఎస్ నాయకులన ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అవినీతి చేయలేదంటున్న మార్కెట్ చైర్మన్ నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు రాకుండా ఎందుకు తప్పుకున్నారని విమర్శించారు. పెద్ద ముద్దునూరు గ్రామంలోనే 40 లక్షలకు పైగా అవినీతి జరిగిందని వారు ఆరోపించారు.

ప్రభుత్వం, జిల్లా (Nagarkurnool) యంత్రాంగం పూర్తిస్థాయిలో విచారణ చేపడితే కోట్లాది రూపాయల గన్ని బ్యాగులకు సంబంధించిన నగదు అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. తమ వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మార్కెట్ చైర్మన్ అవినీతిపై ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 80లక్షల గన్ని బ్యాగ్ లు అవసరం కాగా కేవలం 20 లక్షల గన్ని బ్యాగ్ లను మాత్రమే రైతులకి సరఫరా అయినట్లు తెలిపారు. మిగత గన్ని బ్యాగ్ లను సరఫరా చేయకుండా ఈ కృత్రిమ గన్ని బ్యాగ్ ల కొరత సృష్టించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీన్ని ఆసరా చేసుకుని ప్రస్తుత మార్కెట్ చైర్మన్ రమణ రావు బ్లాక్ లో గన్ని బ్యాగ్ ల సరఫరా చేసే దందా మొదలు పెట్టారన్నారు.

ఈ రకంగా ఒక గన్ని బ్యాగ్‌కి రూ.5 నుంచి 15 రూపాయలు అదనంగా తన అనుచరగణం తో దందా చేసి గన్ని బ్యాగ్‌ల పేర కోటికి పైగా అవినీతికి పాల్పడి రైతులను అన్యాయంగా మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, కొందకింది మాధవరెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>