కలం, కరీంనగర్ బ్యూరో: బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) వర్ధంతి సందర్భంగా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman kumar) జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా నిలిచారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక సమానత్వం, అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

