Mobile Popup Ad
Mobile Popup Ad

టాలీవుడ్ ప్రొడ్యూసర్‌పై చీటింగ్ కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రొడ్యూస‌ర్ వెంకట అనీష్ రెడ్డి (Venkata Anish Reddy) చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. ఆయ‌న‌పై మరో ప్రొడ్యూస‌ర్ ర‌జిత్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడి నుండి రూ.40 లక్షలు ఇప్పించిన రజిత్ రావును అనీష్ మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డ‌బ్బులతో పాటు మ‌రిన్ని కోట్లాది రూపాయ‌ల‌ను త‌న నుంచి తీసుకున్న‌ట్లు ఆరోపించారు. ఇప్పుడు డ‌బ్బులు అడుగుతుంటే తిరిగి ఇవ్వ‌క‌పోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడ‌ని వెల్ల‌డించారు. ర‌జిత్ రావు ఫిర్యాదుతో అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు BNS 318(4), 351(2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఇప్ప‌టికే ఏకే ఖాన్ కొడుకు మోసిన్ ఖాన్‌పై క్రిమినల్ కేసు న‌మోదైంది. ప్రొడ్యూస‌ర్ అనీష్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఓ సినిమా నిర్మాణానికి సంబంధించి పెట్టుబ‌డులు పెట్టుబ‌డులు పెట్టిస్తామ‌ని న‌మ్మించి మోసిన్ త‌న‌ను మోస‌గించాడ‌ని అనీష్ ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చాన‌ని, ఇప్పుడు డ‌బ్బులు అడుగుతుంటే ముఖం చాటేస్తూ బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>