Mobile Popup Ad
Mobile Popup Ad

సంధ్య థియేటర్‌ కేసు.. నేడు నాంపల్లి కోర్టు ముందుకు అల్లు అర్జున్..!

కలం, వెబ్ డెస్క్ : ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  రాకతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నేడు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరిగనుంది. గత విచారణ సందర్భంగా ఈ కేసులోని ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది. 23 మంది నిందితులు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

అయితే గత విచారణలో వర్చువల్ గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. నేటి విచారణలో కూడా అలాగే విచారణలో పాల్గొననున్నట్లు సమాచారం అందుతోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఫాంటసీ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. దీంతో వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరుకాలేనని అల్లు అర్జున్ కోర్టుకు తెలిపారని తెలుస్తోంది. ఆయన వర్చువల్ విధానంలోనే విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>