Mobile Popup Ad
Mobile Popup Ad

వివాదంలో ఎన్టీఆర్ సినిమా.. త‌మిళ‌నాడు నుంచి వార్నింగ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: స్టార్ హీరో ఎన్టీఆర్‌ (NTR), మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ (Trivikram) కాంబినేష‌న్‌లో రూపొందుతున్న స‌రికొత్త మూవీకి ఆదిలోనే ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. ఈ సినిమాను ఆపేయాలంటూ త‌మిళ‌నాడు నుంచి వార్నింగ్‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల జూన్ 29న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇంకా సినిమా పేరు ఖ‌రారు చేయ‌లేదు. కాగా, ఈ పోస్ట‌ర్‌ను నిర్మాత నాగ‌వంశీ త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. దీనికి ఓ క్యాప్ష‌న్ జోడించారు. ఇందులో దేవుడు మురుగ‌న్ ఉత్త‌ర భార‌త దేశంలో జ‌న్మించాడ‌ని పేర్కొన‌డం వివాదానికి కార‌ణ‌మైంది. దీనిపై తమిళనాడు (Tamil Nadu)లోని రాజకీయ పార్టీ నామ్ తమిళర్ కట్చి (NTK) కో ఆర్డినేటర్ సీమేన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మురుగ‌న్ త‌మిళుల ఆరాధ్య దైవ‌మ‌ని, ఆయన చరిత్రను వక్రీకరించడం సహించలేమని సీమేన్ హెచ్చరించారు. సినిమా పేరుతో తమిళ సంస్కృతిని అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చిత్రబృందాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తమిళనాడులో ఈ సినిమాను అడ్డుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ సినిమా త‌మ సంస్కృతిని కించ‌ప‌రిచే విధంగా ఉంటే త‌క్ష‌ణ‌మే ఆపేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రి మూవీ టీం దీనిపై ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>