కలం, వెబ్‌డెస్క్: పంచాయతీ రాజ్ (Gram Panchayat), గ్రామీణాభివృద్ధిశాఖ విడుదల చేసిన మార్గదదర్శకాలతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత ఇచ్చిన జీవోలో సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షుడు, ప్రత్యేకాధికారికి చెక్ పవర్ ఇచ్చారు. దీంతో గందరగోళం నెలకొన్నది. తాజాగా ఈ జీవోను సవరిస్తూ మరో జీవోను విడుదల చేశారు. కొత్త జీవో ప్రకారం ఉప సర్పంచ్‌కు కూడా జాయింట్ చెక్ పవర్ ఉండనున్నది. దీంతో గందరగోళానికి తెరపడింది. ఇప్పటివరకూ ఉన్న నిబంధన లాగానే ఇక నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో చెక్ పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌కు ఉండేలా సవరణ చేసి ఉత్తర్వులు ఇచ్చిన పంచాయతీరాజ్‌శాఖ క్లారిటీ ఇచ్చింది.
Read Also: శివాజీ కామెంట్స్ పై మంచు మనోజ్ ఫైర్
Follow Us On: Pinterest


