కలం, నాగర్ కర్నూల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే (Nagarkurnool MLA) కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (Kuchukulla Rajesh Reddy) అన్నారు. నాగర్ కర్నూల్ మండలం తుడుకూర్తి గ్రామంలో రూ.140 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
అలాగే క్యాంప్ ఆఫీస్‌లో మంతటి గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు MLA సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ విధాన లక్ష్యం అన్నారు. అందుకే ఎన్నికల హామీలతో పాటు చెప్పని వాటిని అమలు చేస్తున్నాం అన్నారు. యంగ్ ఇండియా స్కూళ్ల వల్ల పేదలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందుతుందని అన్నారు.
కాంగ్రెస్ పనితీరును చూసి ప్రజలు పార్టీకి ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయానికి తావు లేదన్నారు. ఎన్నికల తర్వాత అందరూ ఒక్కటే అన్నారు. కొందరు అర్థం లేని రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటయ్య , టౌన్ ప్రెసిడెంట్ జాక్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

