కలం, జనగామ: కల్తీ, కుళ్లిన మాంసం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న మటన్ షాపులపై ఫుడ్ సేప్టీ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం జనగామ (Jangaon) జిల్లాలోని మటన్ షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా జంతువులను వధిస్తూ విక్రయిస్తున్న వారి షాపులను గుర్తించారు.
వారి వద్ద నుంచి సుమారు 150 కిలోల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మాంసాన్ని గోతి తీసి పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా జంతువులను వధిస్తూ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

