epaper
Friday, January 16, 2026
spot_img
epaper

శివాజీపై తెలంగాణ మహిళా కమిషన్​ సీరియస్​

కలం, వెబ్​ డెస్క్​ : యాక్టర్​ శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్​ (Telangana Women Commission) సీరియస్​ అయింది. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళ కమిషన్​ చైర్​ పర్సన్​ నేరేళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను కమిషన్​ లీగల్​ టీమ్ పరిశీలిస్తుందని చెప్పారు. హీరోయిన్లను కించపరుస్తూ మాట్లాడిన శివాజీపై తప్పకుండా చర్యలు తీసుకుంటామాని మహిళ కమిషన్​ చైర్ పర్సన్​ నేరెళ్ల శారద తెలిపారు. కాగా, శివాజీ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపాయి. పలువురు నటులు, నెటిజన్లను శివాజీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సింగర్​ చిన్మయి, యాంకర్​ అనసూయ, మంచు మనోజ్​ తో పాటు పలువురు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>