కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’ (Prabhas Fauzi) విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే వారం విడుదల తేదీతో పాటు ప్రభాస్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిసెంబర్ వరకు సినిమాను మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 3న మూవీని రిలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటిగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్గా వెండితెరకు పరిచయం అవుతుంది. ఇమాన్వితో పాటు మలయాళ నటి నమితా ప్రమోద్, కన్నడ నటి చైత్ర జె. ఆచార్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.

