Mobile Popup Ad
Mobile Popup Ad

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ!

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh)కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న వేలం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. బండ్ల గణేష్‌కు అనుకూలంగా గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టేసింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని కారణంగా, జూబ్లీహిల్స్ లోని బండ్ల గణేష్‌కు చెందిన ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.8.50 కోట్లకు వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ బండ్ల గణేష్ (Bandla Ganesh) డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్, బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం, ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. బ్యాంక్ నిర్వహించిన ఆస్తుల వేలం సరైన నిర్ణయమేనని స్పష్టం చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సానుకూలంగా తీర్పు వెలువరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>