Mobile Popup Ad
Mobile Popup Ad

అభిమానానికి కొత్త నిర్వచనం.. వరిచేనులో ‘KUR’ అక్షరాలతో రైతు వినూత్నం

కలం, ఖమ్మం బ్యూరో: నాయకులపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఒక రైతు (Khammam Farmer) తన అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను అత్యంత వినూత్నంగా ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు.

​ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన ఒక రైతు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని సరికొత్తగా చాటుకున్నారు. తన పొలంలో వరి నారును నాటేటప్పుడు, అది పెరిగి పెద్దదయ్యేసరికి కందాల ఉపేందర్ రెడ్డి పేరు ప్రథమాక్షరాలైన “KUR” రూపంలో కనిపించేలా వినూత్నంగా సాగు చేశారు.

పచ్చని వరిచేల మధ్యలో “KUR” అనే అక్షరాలు స్పష్టంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రైతు చూపించిన ఈ వినూత్న అభిమానాన్ని స్థానికులతో పాటు నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>