Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రశ్న రావణ్‌కు మళ్లీ షాక్: మరో కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు!

కలం, వెబ్ డెస్క్ : ప్రశ్న రావణ్‌ (Prashna Ravan)పై కేసుల పర్వం కొనసాగుతోంది. వరుస అరెస్టులు, బెయిల్స్‌తో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్ పొందిన ఆయనకు, ఒకదాని వెనుక ఒకటిగా కొత్త కేసులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మచిలీపట్నం కోర్టులో ఆయనకు ఊరట లభించినప్పటికీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మచిలీపట్నం కోర్టు ప్రశ్న రావణ్‌ (Prashna Ravan)కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు నుంచి విడుదలైన వెంటనే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు ఆయనను మరో కేసులో అరెస్ట్ చేశారు. పాయకరావుపేటలో నమోదైన కేసు ఆధారంగా అక్కడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తరలించారు. ఇప్పటివరకు వరుసగా నాలుగు సార్లు అరెస్ట్ కావడం, మూడు కేసుల్లో బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన ప్రతిసారీ కొత్త కేసులో తిరిగి అరెస్ట్ కావడం రావణ్ కేసుల పర్వంలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>