కలం, నిర్మల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) పంచ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన గురుపూజ (Guru Pooja) మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్మల్ (Nirmal) నగర సంఘ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో గల ఆర్‌కే కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనికి ముఖ్య అతిథిగా కంబైన్డ్ ఆటోమోటివ్ జనరల్ మేనేజర్ నార్లపురం నితీష్ కుమార్, ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కె.జయదేవ్ హాజరవుతున్నారని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని స్వయం సేవకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Read Also: కొత్త బంగారం పథకం వచ్చేస్తోంది!
Follow Us On: Instagram

