Mobile Popup Ad
Mobile Popup Ad

20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలి.. సీఎంకు కేటీఆర్ లేఖ

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)కి ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా ఉద్యోగాలు వేయడం లేదని లేఖలో ప్రస్తావించారు. ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని చెప్పి దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు కేవలం 17,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది..

నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదే తెలంగాణ ఉద్యమ నినాదమని గుర్తు చేసిన కేటీఆర్.. నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఎక్కువ శాతం పేద మధ్యతరగతి గ్రామీణ వర్గాల్లోనే పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే యువత ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడుతూ హైదరాబాద్‌లో కష్టపడి పరిక్షలకు సన్నద్ధమవుతున్నారని.. వారి ఆశలపైన నీళ్లు చల్లవద్దని కోరారు. పోలీస్ శాఖలో 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫై చేసి 1,60,000 కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని లేఖలో వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>