Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? సీపీఐ నేతల ఫైర్

కలం, హనుమకొండ: పేదలకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వారి గూడును కూల్చివేయడం దుర్మార్గమని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్ల కూల్చివేతలేనా అంటూ సీపీఐ (CPI) జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా పరిధిలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్‌లో ఇండ్ల కూల్చివేత జరిగినా విశ్రమించకుండా ఇండ్ల స్థలాలు, గూడు కోసం పేదలు చేపట్టిన భూపోరాటంలో వంటా-వార్పు కార్యక్రమానికి హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పేదలకు భూములు, గృహ వసతి కోసం కమ్యూనిస్టులే నిరంతరం పోరాడుతున్నారని గుర్తుచేశారు. నిరుపేదలు ఎంతో ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే, నేడు వారి ఇండ్లను కూల్చి రోడ్డున పడేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలన్నారు. హనుమకొండ (Hanumakonda) గుండ్ల సింగారంలో సర్వే నెంబర్లు 174, 175లలో నేడు చెరువు శిఖం భూమి లేనే లేదని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు 1,360 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని అన్నారు.

గత ఐదేళ్లుగా అక్కడ పేదలు సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. గుండ్ల సింగారంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు వుట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల భిక్షపతి, గ్రామ పెద్దలు గాదె మొగిలి, జన్ను కృష్ణ, సీపీఐ నాయకులు మాలోత్ శంకర్ నాయక్, గుంటీ రాజేందర్, పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, మామునూరి దామోదర్, పూజారి నరేందర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, మాలోత్ మంగ, నలువాల సంధ్య, తాటికంటి మమత, గుంటీ రజిత, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భూపోరాట కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>