Mobile Popup Ad
Mobile Popup Ad

దోపిడి దొంగల్లా జైల్లో బంధించారు.. వెలుగుమట్ల బాధితుల కన్నీటి ఆవేదన

కలం, వెబ్ డెస్క్: ఖమ్మం వెలుగుమట్లలో (Velugumatla) ఇండ్లు కోల్పోయిన బాధితులు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘మమ్మల్ని దోపిడి దొంగల్లా 100 రోజులపాటు జైల్లో బంధించారు’ అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ ఎత్తున బుల్డోజర్లతో తమ ఇండ్లను కూల్చివేశారని ఆరోపించారు. మొత్తం 1,895 కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేసిన ప్రభుత్వం, ప్రస్తుతం కేవలం 360 మందిని మాత్రమే ఇండ్లు పొందడానికి అర్హులుగా ప్రకటించడం అన్యాయమంటున్నారు. మిగిలిన వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరాశ్రయులైన బాధితులు పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ భవన్‌లో తాత్కాలికంగా నివసిస్తున్నారు. అక్కడ నుండి కూడా బాధితులను పోలీసులు బలవంతంగా బయటకు పంపిస్తుండటం ఉద్రిక్తంగా మార్చింది. నిన్న ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాల జాబితాలో అర్హుల పేర్లు లేవని లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఈ ఆశ్రయం నుంచి కూడా ఖాళీ చేయిస్తే తాము ఎక్కడికి వెళ్ళాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గూడు కోల్పోయి, పునరావాసం కూడా కరువై నడిరోడ్డున పడ్డ తమను ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తున్నారు.

Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>