Mobile Popup Ad
Mobile Popup Ad

అప్పులపై తప్పుడు ప్రచారం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఈ మేరకు జూపల్లిని ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పదేళ్లలో ప్రభుత్వ గ్యారెంటీలతో సహా రూ.4.17 లక్షల అప్పు చేసిందని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పామన్నారు.

సీఎం రేవంత్ స్వయంగా చెప్పారు..

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని జూపల్లి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాము ఎంత చేశామో.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారో పూర్తి వివరాలను జూపల్లి వాట్సాప్ నెంబరుకి పంపించానని.. పరిశీలించుకోవచ్చన్నారు.

మీ లాగా పూటకోసారి మాట మార్చే వ్యక్తులం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అప్పులపై అసెంబ్లీనే కాకుండా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమే అని మరోసారి సవాల్ చేశారు.

మరికాసేపట్లో ప్రెస్ క్లబ్‌కి జూపల్లి..

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాను చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ కి వస్తానని సవాల్ చేశారు. చెప్పినట్లుగానే, ఆయన మరికాసేపట్లో అక్కడకు రాబోతున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు వస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది. ఆయన వస్తామని బయల్దేరినా, పోలీసులు నిన్నటి మాదిరి అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>