Mobile Popup Ad
Mobile Popup Ad

జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేకం!

​కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం (Jamalapuram Temple)లో మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శృంగేరి శారదా పీఠం 37వ జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారి అమృత హస్తాల మీదుగా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

​మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని ఆలయానికి (Jamalapuram Temple) వచ్చిన భక్తులందరికీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహనరావు, ధర్మకర్త విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రముఖ దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు ఆలయ అర్చక బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Read Also: అయోధ్య ఘటన కలిచివేసింది.. RSS సంచలన ప్రకటన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>