కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం (Jamalapuram Temple)లో మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శృంగేరి శారదా పీఠం 37వ జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారి అమృత హస్తాల మీదుగా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన భక్తులందరికీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహనరావు, ధర్మకర్త విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రముఖ దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు ఆలయ అర్చక బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

