అమీన్‌పూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

క‌లం మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ (Ameenpur) పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణాకు పాల్పడుతున్న‌ర‌నే విశ్వసనీయ సమాచారంతో SOT, అమీన్‌పూర్, కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఓఆర్ఆర్ సుల్తాన్‌పూర్ ఎగ్జిట్-4 వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా, ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 17 ప్యాకెట్లలో 34.50 కిలోల ఎండిన గంజాయి లభించింది. విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

సుమిత్ బిపిరి, బాబుల్ మండ‌ల్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి నుంచి హైదరాబాద్‌లోని స్మోకర్లకు గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరించారు. ప్రధాన వ్యక్తి సుఖ్‌దేవ్ (ఒడిశా) పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. NDPS చ‌ట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>