విద్యార్థులకు ‘నీళ్ల చారు’తోనే అన్నం!

కలం,‌ జోగుళాంబ గద్వాల: కేటిదొడ్డి మండలంలోని ఓ‌ ప్రభుత్వ పాఠశాలలో (Gadwal Govt School) విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి, పప్పు, కూరగాయలు లేకుండా కేవలం పల్చటి “నీళ్ల చారు”తోనే భోజనం వడ్డించారు. ​విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించడంలో పూర్తిగా విఫలమయ్యారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

నిధుల కొరత సాకుతోనో, లేదా ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లో విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెడు దొడ్డి ఎంఈఓ విజయభాస్కర్ వివరణ కొరగ పాఠశాలలో నాణ్యతలేని భోజనం వడ్డిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు‌ మద్యాహ్న భోజనంలో‌ నీళ్ల‌చారు అన్నం వండించినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>