కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఏవీయేషన్ చరిత్రలో సరికొత్త చరిత్ర అధ్యాయం ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) సేవలు నేటి నుంచి షురూ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం దేశంలోని అత్యంత పొడమైన రన్ వే ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయింది.
దీంతో కొత్త ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో విమానం నిలిచింది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానం ద్వారా వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరు, ఢిల్లీ, గోవా నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభ కానున్నాయి. కాగా, భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులో రావడంతో ఇప్పటివరకు సేవలు అందిస్తూ వస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం సేవలు ముగిశాయి. విశాఖ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ విమానాలు, ప్రముఖులవి మాత్రమే ల్యాండ్ అవుతాయి.

