epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రోహిత్ వర్సెస్ స్మృతి మంధానా.. ఎవరి స్టాట్స్ ఎలా ఉన్నాయంటే..!

కలం, వెబ్ డెస్క్: భారత మహిళల క్రికెట్‌లో మరో ఐకానిక్ మూమెంట్! స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా (Smriti Mandhana) ఆదివారం (డిసెంబర్ 21) విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధానా నిలిచింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె పేరు నమోదైంది.

బేట్స్ తర్వాత మంధానానే!

మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ లెజెండ్ స్యూజీ బేట్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 177 మ్యాచ్‌ల్లో సగటు 29.11, స్ట్రైక్ రేటు 108.58తో ఆమె 4,716 పరుగులు చేసింది. బేట్స్‌కు 4,000 పరుగుల మైలురాయికి చేరుకోవడానికి 3,675 బంతులు పట్టగా, మంధానా మాత్రం కేవలం 3,227 బంతుల్లోనే ఆ మార్క్‌ను టచ్ చేసింది.

154 టీ20లు… మంధానా vs రోహిత్ పోలిక

ప్రస్తుతం భారత మహిళల జట్టు వైస్‌కెప్టెన్‌గా ఉన్న మంధానా(Smriti Mandhana) ఇప్పటివరకు 154 టీ20లు ఆడింది. ఈ దశలో ఆమె గణాంకాలను మాజీ భారత పురుషుల ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పోల్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మంధానా:

154 మ్యాచ్‌లు
4,007 పరుగులు
సగటు 29.90
స్ట్రైక్ రేటు 123.78
ఇంగ్లాండ్‌పై 26 మ్యాచ్‌ల్లో 945 పరుగులు (సగటు 39.37)
ఆస్ట్రేలియాపై 26 మ్యాచ్‌ల్లో 737 పరుగులు

రోహిత్ శర్మ:

154 మ్యాచ్‌లు
4,042 పరుగులు
సగటు 31.82
స్ట్రైక్ రేటు 139.66
న్యూజిలాండ్‌పై 17 మ్యాచ్‌ల్లో 511 పరుగులు
ఇంగ్లాండ్‌పై 15 మ్యాచ్‌ల్లో 410 పరుగులు

50+ స్కోర్లు ఎవరివి ఎక్కువ?

మంధానా: 32 సార్లు 50కి పైగా స్కోర్లు
1 శతకం, 31 అర్ధశతకాలు
బెస్ట్: 112 vs ఇంగ్లాండ్ (నాటింగ్‌హామ్, 2025)
ఇంగ్లాండ్‌పై 8 ఫిఫ్టీలు, ఆస్ట్రేలియాపై 7

రోహిత్ శర్మ: 35 సార్లు 50+ స్కోర్లు
5 శతకాలు, 30 అర్ధశతకాలు
బెస్ట్: 121* vs అఫ్ఘానిస్తాన్ (బెంగళూరు, 2024)

విజయంలో ఎవరు గేమ్ ఛేంజర్?

మంధానా: భారత్ గెలిచిన 87 టీ20ల్లో మంధానా కూడా ఉంది. ఈ విజయాల్లో సగటు 34.73తో 2466 పరుగులు చేసింది. ఓడిన మ్యాచ్‌ల్లో 1,418 పరుగులు చేసింది.

రోహిత్: భారత్ గెలిచిన 104 టీ20ల్లో జట్టులో భాగమయ్యాడు. గెలిచిన మ్యాచ్‌లలో 36.98 సగటుతో 3,107 పరుగులు చేశాడు. ఓడిన మ్యాచ్‌ల్లో 739 పరుగులు చేశాడు.

చేజింగ్ vs ఫస్ట్ బ్యాటింగ్

మంధానా: చేజింగ్‌లో: 1,924 పరుగులు (73 మ్యాచ్‌లు)
ముందుగా బ్యాటింగ్: 2,083 పరుగులు (81 మ్యాచ్‌లు)

రోహిత్: చేజింగ్‌లో: 1,520 పరుగులు
ముందుగా బ్యాటింగ్: 2,522 పరుగులు

Read Also: బౌలింగ్ గైడెన్స్ కోసం భారత్ ఫోన్ చేసింది: పాక్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>