కలం, వెబ్ డెస్క్: కథల ఎంపికల విషయంలో ‘రంగస్థలం’ సినిమా తనను పూర్తిగా మార్చేసిందని హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘లెనిన్’ చేయడానికి ఆ సినిమానే చాలా ధైర్యం ఇచ్చిందన్నారు. సుకుమార్ ఏ కథ రాసుకున్నారో.. అదే తీశారన్నారు. ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదేనని రామ్ చరణ్ కు కూడా చాలా సార్లు చెప్పానని తెలిపారు. హీరోకు చెవిటి సమస్య పెట్టడం, అతడి వలనే సమస్యలు రావడం, పరిష్కరించుకోవడం.. ఈ జనరేషన్ లో ఇంతటి రూటెడ్ మూవీ మరొకటి లేదన్నారు.
వారసత్వం కొనసాగించడం ఈజీ కాదు..
అక్కినేని నట వారసత్వం కొనసాగించడం అంత ఈజీ కాదని అఖిల్ (Akhil Akkineni) చెప్పుకొచ్చారు. బయట చూసేవాళ్లకు తనకు అవకాశాలు అవలీలగా వస్తాయని భావిస్తుంటారని.. అలా వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడం చాలా ఒత్తిడిగా ఉంటుందన్నారు. అయితే తాను చాలా పాాజిటివ్‌గా ముందుకు వెళ్తానని, ప్రతీ చిత్రాన్ని వంద శాతం కష్టపడి చేస్తుంటానన్నారు. లెనిన్ మూవీ చూశాక, ఇక నుంచి అఖిల్ సినిమాకు వెళితే ఆసక్తికరంగా ఏదో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారని చెప్పారు.
పోస్ట్ చేయమని నేను చెప్పలేదు..
లెనిన్ మూవీ చూశాక తన తండ్రి నాగార్జున చాలా సంతోషించారని అఖిల్ అన్నారు. అందుకే ‘తేదీ గుర్తు పెట్టుకోండి’ అని పోస్ట్ చేశారని, అలా పెట్టమని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రతీ మూవీకి ఒత్తిడి చాలా సహజమని.. దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంటానన్నారు. ఏజెంట్ మూవీ నిజంగా బాగా లేదని, దాన్ని తాను ఒప్పుకుంటున్నట్లు వివరించారు. థియేటర్‌లో చూసి చాలా నిరాశ చెందానని, అప్పుడే అది ఫెయిల్ అవుతుందనిపించిందన్నారు. రిలీజ్ తరువాత మన చేతుల్లో ఏం ఉండదని.. వాస్తవం అంగీకరించి ముందుకు వెళ్లాల్సిందేనని వివరించారు.
రెండు సర్జరీల కారణంగానే..
ఏజెంట్ మూవీ తరువాత తాను రెండు సర్జరీలు చేయించుకోవాల్సి రావడంతో మూడేళ్లు గ్యాప్ వచ్చిందని అఖిల్ అన్నారు. గాజు గ్లాస్ గుచ్చుకోవడంతో.. చాలా ఇబ్బంది అయిందని, కోలుకోవడానికి 16 నెలలు పట్టిందన్నారు. తన వేలు విరిగిపోయిందని, ఫిజియోథెరపీకి సమయం పట్టిందన్నారు. ఆ సమయంలోనే తాను ఎలాంటి మూవీ చేయాలనే ఆలోచించినట్లు వివరించారు. రంగస్థలం లాంటి రూటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉండేదని, లెనిన్‌తో అది నెరవేరబోతుందన్నారు.
Read Also: రజనీకాంత్ ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Follow Us On: Sharechat

