కలం, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2′(Jailer2) విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. “అలప్పర కెలప్పురోమ్!” అంటూ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోలో చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. దీంతో తలైవా అభిమానుల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియాలో #Jailer2FromOct15 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది. 2023లో విడుదలైన ‘జైలర్’ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండటంతో.. సినిమా చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

