Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాకు భారీ షాక్.. బెల్జియం మ్యాచ్‌కు బలోగన్ దూరం

కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా (USA) జట్టుకు కీలక ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్‌కు(Folarin Balogun) చూపిన రెడ్ కార్డుపై అప్పీల్‌కు అవకాశం లేదని ఫిఫా స్పష్టం చేసింది. దీంతో అతడు బెల్జియంతో(Belgium) జరిగే ప్రీక్వార్టర్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన రౌండ్ ఆఫ్-32 మ్యాచ్‌లో టారిక్ ముహరేమోవిచ్‌పై చేసిన టాకిల్‌ను వీఏఆర్ పరిశీలించిన అనంతరం రిఫరీ బలోగన్‌కు రెడ్ కార్డు చూపించాడు. దీంతో అమెరికా 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను పూర్తి చేసినప్పటికీ మరో గోల్ చేసి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది.

మ్యాచ్ అనంతరం అమెరికా కోచ్ మౌరిసియో పోచెట్టినో రెడ్ కార్డు నిర్ణయాన్ని ప్రశ్నించినా, ఫిఫా నిబంధనల ప్రకారం దీనిపై అప్పీల్ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ టోర్నీలో మూడు గోల్స్‌తో అమెరికా టాప్ స్కోరర్‌గా ఉన్న బలోగన్ బెల్జియం మ్యాచ్‌కు దూరం కావడం ఖాయమైంది. అవసరమైతే ఫిఫా క్రమశిక్షణ కమిటీ అతనిపై అదనపు నిషేధం కూడా విధించే అవకాశం ఉంది.

Read Also: రూ.32 లక్షల జాబ్‌ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>