కలం, కరీంనగర్ బ్యూరో : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెల రోజులు (జూలై 1వ తేది నుండి 31 వరకు) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్దంగా డీజే వినియోగించరాదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసులకు ఈ విషయంలో సహకరించాలని ఎస్పీ కోరారు.

