Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి: శివకుమార్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ (Land Acquisition) పనుల్ని వేగవంతంగా కొనసాగించాలని ఆర్‌అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ ఆదేశించారు. సర్వే పూర్తయిన వాటికి నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్‌అండ్ఆర్ కమిషనర్ శివకుమార్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నీటిపారుదల శాఖ, సర్వే శాఖ, ఎస్డీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భూసేకరణ పనుల పురోగతిపై చర్చించారు.

భూసేకరణ వేగవంతం చేయాలి..

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ (Land Acquisition) పనుల్ని వేగవంతంగా కొనసాగించాలని సూచించారు. సర్వే పూర్తయిన వాటికి నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, బుద్ధారం లెఫ్ట్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్‌ఐ) డి-1, డి-5, డి-8 కాలువలు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పెగ్ మార్కింగ్, సర్వే పూర్తయిన 269 ఎకరాల భూములకు వెంటనే సబ్ డివిజన్ రిపోర్ట్ (SDR) పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.

జులై 10 లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్

అదేవిధంగా, ఎస్డీఆర్ పూర్తి అయిన వెంటనే ఆయా భూములకు జులై 10 లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. అదేవిధంగా, ఇంకా పెగ్ మార్కింగ్ పూర్తి కానీ భూములకు సైతం వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియలు నిర్దేశిత సమయం ప్రకారం అమలు చేస్తే భూసేకరణ పనులు వేగవంతమై ప్రాజెక్టుల పురోగతి మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్, సర్వే శాఖ ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>