Mobile Popup Ad
Mobile Popup Ad

సినిమాపై ప్యాషన్ ఉందా? PKCW గోల్డెన్ ఛాన్స్..

కలం, సినిమా : సినీ రంగంలో ఆసక్తి ఉన్న వారికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్, టెక్నీషియన్‌లు, కళాకారులు, కొత్తగా సినీ రంగంలోకి రావాలనుకునే యువత, నిపుణులు, పరిశోధకులు అందరూ PKCW కమ్యూనిటీలో చేరాలని ఆహ్వానించింది. సినిమా రంగంలోని ప్రతి విభాగానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కమ్యూనిటీ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

సృజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలను పంచుకునే గ్లోబల్ క్రియేటివ్ ఎకోసిస్టమ్‌గా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో సినీ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నటన, దర్శకత్వం, రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ తదితర విభాగాలలో ప్రతిభ ఉన్నవారికి ఈ కమ్యూనిటీ కొత్త అవకాశాలకు వేదికగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: వాట్సాప్ ‘యూజర్‌నేమ్ ఫీచర్‌’పై కేంద్రం అలర్ట్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>