కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర క్యాబినెట్ (Modi Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 14,115 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ బుందేఖండ్ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచేందుకు రూ.7,145 కోట్లతో కాన్పుర్ – కబ్రాయ్ హైవే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఢిల్లీలోని 6 లేన్ల ద్వారకా టన్నెల్ ప్రాజెక్టు కు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 6,970 కోట్లతో నిర్మించనున్న ఈ ఆరు లేన్ల అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది.
Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?
Follow Us On: Instagram

