Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీకి 2 సీట్లు కూడా రావు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు

కలం, వెబ్ డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకంటే ఎక్కువ సీట్లు రావని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే.. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు తమపై విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వస్తే పట్టుమని రెండు వేల మందిని కూడా పోగు చేసుకోలేని పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తాం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని అనటం సిగ్గుచేటు అని విమర్శించారు. బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన 8 పార్లమెంట్ ఎన్నికల్లో 2 గెలిస్తే ఎక్కువ అని జోస్యం చెప్పారు. ఇటీవల తమ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సీటును బీజేపీ దొంగిలించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో తాము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పారని విమర్శించారు. వెస్ట్ బెంగాల్‌లో ఓట్ల చోరీ చేసి ప్రజలను వంచించారని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>