Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ ఈఏపీసెట్‌-2026 ఫలితాలు విడుదల..

కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు (AP EAPCET-2026) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులందరికీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల విజయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది (70.52%), అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 63,546 మంది (89.59%) విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు ముందంజలో నిలవడం గర్వకారణమని లోకేశ్ కొనియాడారు. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in/EAPCET) లేదా వాట్సాప్ సేవ (9552300009) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని  తెలిపారు.

Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>