కలం, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అంబం గ్రామానికి చెందిన ఓనె మహిపాల్ అనే వ్యక్తిని అతడి భార్య స్వరూప, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హతమార్చారు. ఇంట్లోనే అతడికి ఉరి వేసి చంపేసి తర్వాత స్వరూప ఏమీ తెలియనట్లు నటిస్తూ మహిపాల్ గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే మహిపాల్ మెడపై లోతైన గాయాలు ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిపాల్ మృతదేహాన్ని పూర్తిగా తనిఖీ చేయడంతో అసలు నిజం వెలుగుచూసింది. మహిపాల్ భార్యను తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. దీంతో భార్య, స్వరూప, ఆమె ప్రియుడే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితులిద్దరినీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలన సృష్టించింది.

