Mobile Popup Ad
Mobile Popup Ad

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్: జూలైలో 12 రోజులు సెలవులు!

కలం, వెబ్ డెస్క్ : భారతదేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులకు ఈ జూలై 2026 నెలలో మొత్తం 12 రోజులు సెలవులు (Bank Holidays) రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల సంస్కృతి, పండుగలు, స్థానిక విశేషాలను బట్టి ఈ సెలవులు మారుతుంటాయి. ఈ నెలలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులతో పాటు అన్ని రకాల బ్యాంకులు ఆయా రోజుల్లో మూసి ఉంటాయి.

ఈ నెలలో వచ్చే శనివారాలు, ఆదివారాల సాధారణ సెలవులతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతీయ పండుగల కారణంగా బ్యాంకులు పనిచేయవు. జూలై 6, 12, 19, 26 తేదీలలో ఆదివారాలు రావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే జూలై 11, జూలై 25 తేదీలు వరుసగా రెండో, నాలుగో శనివారాలు కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఈ శనివారాల్లో ఆర్‌టీజీఎస్ (RTGS), నెఫ్ట్ (NEFT) చెక్ క్లియరింగ్ వంటి కీలక చెల్లింపుల సేవలు కూడా అందుబాటులో ఉండవని గమనించాలి.

ప్రాంతీయ పండుగల విషయానికి వస్తే, జూలై 6వ తేదీన ఐజ్వాల్ లాంటి నగరాల్లో ఎంహెచ్ఐపి డే (MHIP Day) సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. మేఘాలయలోని పిన్నార్ ప్రజలు జరుపుకునే బెహ్ దైంఖ్లామ్ పండుగ సందర్భంగా జూలై 9న షిల్లాంగ్ నగరంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూలై 16న జగన్నాథ రథయాత్ర, హరేలా పండుగల కారణంగా భువనేశ్వర్, డెహ్రాడూన్, ఇంఫాల్ నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి.

స్వాతంత్ర్య సమరయోధుడు యు తిరోత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని జూలై 17న షిల్లాంగ్ నగరంలో మరోసారి బ్యాంకులు మూసి ఉంచుతారు. బౌద్ధులకు అత్యంత పవిత్రమైన డ్రుక్పా త్షె-జి సందర్భంగా జూలై 18న గ్యాంగ్‌టక్ నగరంలో బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత జూలై 22న త్రిపురకు చెందిన ప్రసిద్ధ ఖార్చీ పూజ సందర్భంగా అగర్తలా నగరంలో బ్యాంకులకు సెలవు (Bank Holidays)ఉంటుంది. అందువల్ల ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ఈ సెలవుల జాబితాను చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>