కలం, వెబ్ డెస్క్ : దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ప్రజలు ఎండ వేడిమితో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందిందించింది. ఉత్తర బంగాళాఖాతం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు సుమారు 1,500 కిలోమీటర్ల మేర వర్ష ద్రోణి మేఘం విస్తరించినట్లు వెల్లడించింది. రుతుపవన (Monsoon) ద్రోణిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి.
రుతుపవనాలు (Monsoon) దక్షిణం వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలు, రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా ఉత్తర భారతదేశం ఉక్కపోతను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఈ విస్తారమైన మేఘం ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
Read Also: ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!
Follow Us On : WhatsApp

