కలం, వెబ్ డెస్క్ : ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) స్పందించారు. తప్పుడు అడ్రస్‌కు డెలివరీ చేసి, తిరిగి వచ్చి వాదించాడని, మద్యం మత్తులో తన అమ్మను దుర్భాషలాడాడని ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వివరించారు. ఒకప్పుడు తాను కూడా డెలివరీ బాయ్‌గా పని చేశానని చెప్పుకున్న అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్ ని ఏమీ అనలేదని తెలిపారు.
అయినా, తనదే అంతా తప్పు అన్నట్లు మీడియా చూపించడంపై అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనవైపు నుంచి తప్పు జరిగితే క్షమాపణలు చెబుతానన్నారు. ఒక కొడుకుగా తన పేరెంట్స్ ను దుర్భాషలాడితేనే డెలివరీ బాయ్ ని ప్రశ్నించానని.. అతడిపై ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు. కాగా, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అఖిల్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
తప్పుడు అడ్రస్ కు ఆర్డర్ మార్చి తెచ్చాడనే చిన్న కారణంతో డెలివరీ బాయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దాడి చేశాడని ఆరోపిస్తూ బాధితుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అఖిల్ రాజ్ (Akhil Raj) పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సినిమాతో క్రేజ్ రాగానే తోటి మనుషులను ఇంత నీచంగా చూస్తారా అంటూ ప్రశ్నించారు. సినిమా వాళ్లతో పాటు సాధారణ ప్రజలు సైతం అఖిల్ రాజ్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందంటూ ఆయన వీడియో విడుదల చేశారు.
డెలివరీ బాయ్ దాడి ఘటనపై క్లారిటీ ఇచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్
Akhil Raj Reacts to Delivery Boy Assault Controversy#AkhilRaj #RajuWedsRambhai #DeliveryBoyControversy #ActorAkhilRaj #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/ZY1m0ITd5i— Kalam Daily (@kalamtelugu) June 30, 2026
Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!
Follow Us On: X(Twitter)

