కలం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ (AP UG PG Entrance) షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు 2026-27కు గాను ప్రవేశ పరీక్ష తేదీలను సోమవారం ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈసెట్ ఏప్రిల్ 23న, ఐసెట్ ఏప్రిల్ 28న, పీజీఈసెట్ ఏప్రిల్ 29, 30,మే 2న, లాసెట్ మే 4న, ఎడ్‌సెట్ మే 4న, పీజీసెట్ మే 5, 8, 9, 10, 11 తేదీల్లో జరుగుతాయి. అలాగే ఈఏపీసెట్(ఇంజనీరింగ్) మే 12, 13, 14, 15, 18న ; ఈఏపీసెట్(అగ్రికల్చర్, ఫార్మసీ) మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.


